ఎన్ఆర్ఐలు, భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చా?

ఎన్ఆర్ఐలు, భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చా?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

అవును, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్ఆర్ఐ) మరియు భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు మ్యూచ్‌‌వల్ ఫండ్స్‌లో ఫుల్ రీపాట్రియేషన్ సహా నాన్-రీపాట్రియేషన్ లో కూడా ఇన్వెస్ట్‌ చేయవచ్చు.

అయితే, ఎన్ఆర్ఐలు అన్ని నియంత్రణ అవసరాలైనటువంటి కెవైసి ని ఇన్వెస్ట్‌ చేయడానికి ముందు పూర్తి చేయాలి. అయితే యుఎస్ మరియు కెనడా లాంటి కొన్ని దేశాలలో మ్యూచ్‌‌వల్ ఫండ్స్‌లో ఎన్ఆర్ఐలు సంబంధింత వెల్లడి లేకుండా ఇన్వెస్ట్‌‌మెంట్లని పరిమితం చేశాయని గమనించాలి. ఈ దేశాల ఎన్ఆర్ఐలు, వాస్తవంగా పెట్టుబడి పెట్టడానికి ముందు భారతదేశంలో ఫండ్‌లలో పెట్టుబడి పెట్టగల  సంభవనీయత గురించి తమతమ ఆర్థిక నిపుణుడితో సంప్రదించడం మంచిది.

ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు రెసిడెంట్ ఇన్వెస్టర్లకు ఉండే చాలా ప్రయోజనాలు మరియు సౌకర్యాలు అందజేయబడుతున్నాయి. వారు ఎస్ఐపిల ద్వారా ఇన్వెస్ట్‌ చేయవచ్చు, వారు వారి సౌలభ్యాన్ని బట్టి స్విచ్ చేయవచ్చు, వారు గ్రోత్ లేదా డివిడెండ్ ఎంపికలను కోరుకోవచ్చు మరియు వారు కోరుకున్నప్పుడు రిడెంషన్ ప్రక్రియలను రిపాట్రియేట్ చేయవచ్చు.

అలా ఎన్ఆర్ఐలు మరియు పిఐఒలు విభిన్న రకాల ఇండియన్ మ్యూచు‌వల్ ఫండ్ స్కీములలో ఇన్వెస్ట్‌ చేయడం మరియు ఇన్వెస్ట్‌ ప్రయోజనాలను ఆనందించవచ్చు.

400
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను