అయితే 8 నెలల తరువాత నా సెలవుల కోసం నేను ఇప్పుడు పెట్టుబడి పెట్టవచ్చా?

అయితే 8 నెలల తరువాత నా సెలవుల కోసం నేను ఇప్పుడు పెట్టుబడి పెట్టవచ్చా?
కాలిక్యులేటర్లు

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచువల్ ఫండ్స్ గురించి ఆర్టికల్స్ నిర్దిష్ట లాంగ్ టర్మ్, నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి ప్రణాళిక చేయడానికి రాయబడతాయి మరియు ఇన్వెస్టర్లు ఇతర లక్ష్యాలు, ప్రత్యేకంగా షార్ట్ టర్మ్ సాధించలేనివని అనుకుంటారు.

ఈ అవాస్తవాన్ని ఒక ఉదాహరణతో ఖండిద్దాము.

రమేషుకు ప్రయాణాలు అంటే ఇష్టం, అతను పనిచేసే కంపెనీ విజయాన్ని సాధించి, తన ఉద్యోగులకు బోనస్‌ను బహూకరించినప్పుడు, చూడాల్సిన ప్రదేశాలకు వెళ్లాలని అనుకున్నాడు.

అతని బోనస్తో రమేష్ యూరప్ ట్రిప్కి వెళ్ళాలని అనుకున్నాడు, కానీ పెద్ద పేరున్న ప్రాజెక్టు పని అసంపూర్తిగా ఉంది. గడువు తేదీ దగ్గరపడుతోంది. ప్రాజెక్ట్ రాబోవు 8 నెలల్లో పూర్తి కావచ్చు.

రమేష్ ట్రిప్ యొక్క ఖచ్చితమైన తేదీ ఇంకా నిర్ణయించబడలేదు. అతని ఖర్చులు చూస్తే - కొంత డబ్బు ముందుగా మరియు కొంత ప్రయాణ సమయం లో వెచ్చించాలి. ఖచ్చితమైన తేదీలలో మరియు అక్కడ ఎంత డబ్బు చెల్లించాలి అని అనిశ్చితిగా ఉంది.

అట్టి సందర్భాలలో నిర్దిష్ట మ్యూచువల్ ఫండ్ స్కీములు ఆదర్శమైనవి.

రమేష్ ఈ సేవింగ్స్ని లిక్విడ్ ఫండ్లో ఏదైనా పని దినంనాడు మళ్ళీ తీసుకునేందుకు వీలుగా పార్క్ చేయాలి. అతను విత్డ్రాయల్ అభ్యర్థన సమర్పించిన తరువాత రోజు అతని అకొంటులో డబ్బు ఉంటుంది. రమేష్ విత్ డ్రాయల్ కొరకు అభ్యర్థనని ఎస్ఎమ్ఎస్ లేదా యాప్ ద్వారా కూడా చేయవచ్చు.

దీనితో షార్ట్ టర్మ్ గోల్స్ కొరకు ప్లానింగ్ చేయడం కూడా సౌకర్యవతంగా ఉంటుంది.

403
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను