మల్టీ క్యాప్ ఫండ్స్ అంటే ఏమిటి?

మల్టీ క్యాప్ ఫండ్స్ అంటే ఏమిటి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచువల్ ఫండ్స్ గురించి సమాచారం కోసం చూస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా XYZ మల్టీ క్యాప్ ఫండ్ లాంటి పేర్లు విన్నారా మరియు ఇవి ఎంతో పేరున్న లార్జ్-క్యాప్ ఫండ్స్ కంటే ఎలా భిన్నమైనవని ఆలోచిస్తున్నారా? పేరుకు తగ్గట్టు, మల్టీక్యాప్ ఫండ్, లార్జ్, మిడ్ మరియు స్మాల్ క్యాప్ కంపెనీల వ్యాప్తంగా పెట్టుబడి పెడుతుంది, తద్వారా తమ పోర్ట్ఫోలియోలలో మార్కెట్ క్యాప్స్ వ్యాప్తంగా డైవర్సిఫికేషన్  అందిస్తాయి.

అక్టోబరు 2017 లో జారీచేయబడి, జూన్ 2018 నుండి అమలులో ఉన్న సెబీ యొక్క ఉత్పత్తి వర్గీకరణ సర్క్యులర్ ప్రకారం, ఈక్విటీ ఫండ్స్ తమ పోర్ట్ఫోలియోలో అవి ఉంచిన స్టాక్స్ రకం ఆధారంగా లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ మరియు స్మాల్ క్యాప్స్గా వర్గీకరించబడవచ్చు. భారతదేశంలో వివిధ ఎక్ఛేంజ్లలో బహిరంగంగా జాబితా చేయబడిన అనేక కంపెనీలు ఉన్నాయి. లార్జ్ క్యాప్ అనేది పూర్తి మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా భారతదేశంలో బహిరంగంగా జాబితా చేయబడిన ప్రథాన 100 కంపెనీలను సూచిస్తుంది (మార్కెట్ క్యాపిటలైజేషన్ = బహిరంగంగా జాబితా చేయబడిన షేర్ల సంఖ్య x ప్రతి షేర్ యొక్క ధర). పూర్తి మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 101వ నుండి 250వ కంపెనీని మిడ్ క్యాప్ సూచిస్తుంది, అదే పూర్తి మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 251వ కంపెనీ నుండి స్మాల్ క్యాప్స్ అని పిలువబడతాయి.

లార్జ్ క్యాప్ ఫండ్స్ ఊహించదగిన మరియు స్థిరమైన పెరుగుదల సామర్థ్యం ఉన్న లార్జ్ క్యాప్ కంపెనీలలో పెట్టుబడి పెడతాయి, అదే స్మాల్-క్యాప్ ఫండ్స్, ప్రస్తుతం అధిక సంభావ్య పెరుగుదల దశ గుండా పయనిస్తున్నప్పటికీ, అంతే రిస్క్ ఉన్న స్మాల్-క్యాప్ కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. స్వల్పకాలంలో ఎక్కువ అస్థిరంగా ఉండే స్మాల్ క్యాప్ ఫండ్స్ లాగా కాకుండా, లార్జ్ క్యాప్ ఫండ్స్ తక్కువ రాబడి అయినప్పటికీ స్థిరమైన రాబడులు అందించే అవకాశం ఉంది. అధిక పెరుగుదల సామర్థ్యం ఉన్న, ఇప్పటికే నిర్దిష్ట స్థాయి మరియు స్థిరత్వం సంపాదించాయి కాబట్టి స్మాల్ క్యాప్స్కు సంబంధించిన రిస్క్ను ప్రదర్శించని మిడ్-క్యాప్ కంపెనీలలో మిడ్ క్యాప్ పెట్టుబడి పెడుతుంది. మిడ్ క్యాప్ ఫండ్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లాగా మరీ రిస్క్ గలవిగా ఉండకుండా లార్జ్ క్యాప్ ఫండ్స్ కంటే అధిక రాబడులు అందించవచ్చు. అయినప్పటికీ, వాటికి లార్జ్ క్యాప్ ఫండ్స్ కంటే అధిక రిస్క్కు కొంత అవకాశం ఉంది.  

విభిన్న మార్కెట్ క్యాప్ సెగ్మెంట్ల వ్యాపంగా అసెట్ కేటాయింపుకు సంబంధించి మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీ తప్పక పాటించవలసిన స్పష్టమైన మార్గదర్శకాలను (సెప్టెంబరు 11, 2020 న) సెబీ జారీ చేసింది. మల్టీ క్యాప్ ఫండ్స్ ఏ సమయంలోనైనా తమ అసెట్లలో కనీసం 75% ను ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇన్స్ట్రుమెంట్లలలో ఉంచవలసి ఉంటుంది. ఈ పోర్ట్ఫోలియో తమ అసెట్లలో కనీసం 25% లార్జ్-క్యాప్ స్టాక్స్కు, 25% మిడ్-క్యాప్ స్టాక్స్కు మరియు మరో 25% స్మాల్-క్యాప్ స్టాక్స్కు తప్పక కేటాయించాలి. వైవిధ్యీకరణ మరియు దీర్ఘ-కాలిక సంపద సృష్టికి మల్టీక్యాప్ గ్రోత్ ఫండ్ మంచి ఎంపిక అయినప్పటికీ, దీనిలో కూడా స్వల్పకాలంలో చాలా రిస్క్ ఉంటుంది, ఎందుకంటే స్వల్పకాలంలో చాలా రిస్క్ ఉన్న స్మాల్ మరియు మిడ్-క్యాప్ స్టాక్స్లో కనీసం 50% ఉంచవలసి ఉంటుంది. ఫండ్ మేనేజర్ మార్కెట్ గురించి తనకున్న అంచనాల ప్రకారం కేటాయింపును వివిధ మార్కెట్ క్యాప్ స్టాక్స్ మధ్య మారడంలో అతనికి/ఆమెకు ఉన్న వెసులుబాటును మార్కెట్ క్యాప్ ఎక్స్పోజర్ కు గల గరిష్ట  పరిమితి కూడా పరిమితం చేస్తుంది.

పెట్టుబడిదారులు తమ పోర్ట్ఫోలియోకు మల్టీక్యాప్ ఫండ్ను జోడించే ముందు తమ ప్రస్తుత మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను మరియు వివిధ మార్కెట్ క్యాప్ సెగ్మెంట్లకు ప్రస్తుత ఎక్స్పోజర్ను జాగ్రత్తగా మూల్యాంకనం చేయాలి. 5-7 సంవత్సరాల కంటే తక్కువ సమయ పరిమితి ఉన్న మరియు రిస్క్ తీసుకోవడానికి తక్కువ ఆసక్తి ఉన్న వారికి మల్టీ క్యాప్ ఫండ్స్ అనుకూలం కాదు.

420
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను